
జై శ్రీమన్నారాయణ
ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటలవరకు జూమ్ మీటింగ్ ద్వారా “రామదాసు కీర్తనా వైభవం”
రామదాసుగారి కీర్తనా ప్రాచుర్యం కోసం భక్త రామదాసు ట్రస్ట్ – కొత్తగూడెం మరియు భద్రాచల రామ గాన సమితి – హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల (సెప్టెంబర్ 2021) 26న మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటలవరకు జూమ్ మీటింగ్ ద్వారా “రామదాసు కీర్తనా వైభవం”
రామదాసుగారి కీర్తనా ప్రాచుర్యం కోసం భక్త రామదాసు ట్రస్ట్ – కొత్తగూడెం మరియు భద్రాచల రామ గాన సమితి – హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల (సెప్టెంబర్ ) 26వ తారీకు 2021 నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటలవరకు జూమ్ మీటింగ్ ద్వారా “రామదాసు కీర్తనా వైభవం” నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
దీనికి ముఖ్య అతిధులుగా శ్రీమాన్.ఉ.వే.గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యుల వారు, శ్రీమాన్ కె.ఇ. స్థలశాయి గారు మరియు మంత్రారాజ పీఠాధిపతులు సింహాయాజీ స్వామివారు పాల్గొంటారని తెలిపారు.
గ్రూప్ సభ్యులందరు తప్పకుండ పాల్గొని ఈ కీర్తనా వైభవాన్ని విజయవంతం చేయగలరని కంచర్ల శ్రీనివాసరావు (భక్త రామదాసు వారసులు పదవతరం) కోరారు.