తెలుగు వికీపీడియా శిక్షణా శిబిరం
అంతర్జాల స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియాలో కొత్త వాడుకరులను (రచయితలను) తయారుచేసేందుకు ట్రైన్ ద ట్రైనర్ పేరుతో ఏర్పాటుచేసిన వికీపీడియా శిక్షణా కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు హైదరాబాదులో జరిగింది.
తెలుగు వికీపీడియన్లు పవన్ సంతోష్, ప్రణయ్‌రాజ్ వంగరి ఆధ్వర్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో వికీ రచనపై ఆసక్తి కలిగిన దాదాపు 50మంది పాల్గొని వికీపీడియా, వికీసోర్సు, కామన్సు వంటి ప్రాజెక్టులలో వ్యాసాలు రాయడం, ఫోటోలను మరియు పుస్తకాలను ఎక్కించడం వంటివి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… అంతర్జాలంలో తెలుగు సమాచార వృద్ధికోసం రూపొందించబడిన తెలుగు వికీపీడియాలో వీలైనంత ఎక్కువ సమాచారాన్ని చేర్చాలని, అందుకోసం తెలుగు వికీపీడియాలో రాసేవారి సంఖ్య పెరగాలన్న ఉద్ధేశ్యంతో ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటుచేశామని, ఔత్సాహికుల నుండి దీనికి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్నవారికి వికీపీడియా గురించి అవగాహన కలిపించామని, రాబోవు రోజుల్లో వీరందరికి మరికొన్ని శిబిరాలను నిర్వహించి పూర్తిస్థాయి వికీపీడియన్లుగా మారుస్తామని తెలిపారు.
శిక్షణా శిబిరంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ… తమ దగ్గరున్న సమాచారం వికీపీడియాలో రాస్తే, అది ఇతరులకు ఉపయోగపడుతుందన్న విషయం తమకు నచ్చి వికీ రచనపై ఆసక్తిని కలిగిందని, తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని చేర్చడంలో తాముకూడా భాగస్వామ్యం అవుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వికీపీడియన్లు యర్రా రామారావు, ఆదిత్య పకిడే, యశ్వంత్ ఆలూరు, మహేష్, ఇర్ఫాన్, హరిక, రామేశ్వరం, సుమంత్, సూస్వేత, మౌర్య తదితరులు పాల్గొని వికీ రచనపై కొత్తవారికి శిక్షణను ఇచ్చారు.
(Courtesy: Pranayraj Vangari)
Contents
తెలుగు వికీపీడియా శిక్షణా శిబిరంఅంతర్జాల స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియాలో కొత్త వాడుకరులను (రచయితలను) తయారుచేసేందుకు ట్రైన్ ద ట్రైనర్ పేరుతో ఏర్పాటుచేసిన వికీపీడియా శిక్షణా కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు హైదరాబాదులో జరిగింది.తెలుగు వికీపీడియన్లు పవన్ సంతోష్, ప్రణయ్‌రాజ్ వంగరి ఆధ్వర్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో వికీ రచనపై ఆసక్తి కలిగిన దాదాపు 50మంది పాల్గొని వికీపీడియా, వికీసోర్సు, కామన్సు వంటి ప్రాజెక్టులలో వ్యాసాలు రాయడం, ఫోటోలను మరియు పుస్తకాలను ఎక్కించడం వంటివి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… అంతర్జాలంలో తెలుగు సమాచార వృద్ధికోసం రూపొందించబడిన తెలుగు వికీపీడియాలో వీలైనంత ఎక్కువ సమాచారాన్ని చేర్చాలని, అందుకోసం తెలుగు వికీపీడియాలో రాసేవారి సంఖ్య పెరగాలన్న ఉద్ధేశ్యంతో ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటుచేశామని, ఔత్సాహికుల నుండి దీనికి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్నవారికి వికీపీడియా గురించి అవగాహన కలిపించామని, రాబోవు రోజుల్లో వీరందరికి మరికొన్ని శిబిరాలను నిర్వహించి పూర్తిస్థాయి వికీపీడియన్లుగా మారుస్తామని తెలిపారు. శిక్షణా శిబిరంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ… తమ దగ్గరున్న సమాచారం వికీపీడియాలో రాస్తే, అది ఇతరులకు ఉపయోగపడుతుందన్న విషయం తమకు నచ్చి వికీ రచనపై ఆసక్తిని కలిగిందని, తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని చేర్చడంలో తాముకూడా భాగస్వామ్యం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికీపీడియన్లు యర్రా రామారావు, ఆదిత్య పకిడే, యశ్వంత్ ఆలూరు, మహేష్, ఇర్ఫాన్, హరిక, రామేశ్వరం, సుమంత్, సూస్వేత, మౌర్య తదితరులు పాల్గొని వికీ రచనపై కొత్తవారికి శిక్షణను ఇచ్చారు.